telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్‌ షాక్..పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడు అనంత ఉదయ భాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ నెల 19న మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను తన వెంట తీసుకుని వెళ్లిన ఎమ్మెల్సీ ఆపై గొడవ జరగడంతో మెడ పట్టుకుని వెనక్కి నెట్టియ‌డంతో డ్రైవర్ త‌ల రాయికి త‌గిలి చనిపోయాడని పోలీసుల విచారణలో అంగీకరించారు.

దీంతో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు . అనంత‌రం మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Related posts