telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రా ఆక్టోప‌స్‌ మ‌ళ్ళీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ?

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరుగాంచిన కాంగ్రెస్ ఎంపీ లగ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ మళ్లీ రాజ‌కీయాల్లో రీఎంట్రీ ఇస్తున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.సమైఖ్యాంధ్ర ఉద్యమంలో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన రాజగోపాల్ అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో లగడపాటి రాజగోపాల్ శని, ఆదివారాల్లో పర్యటించి పలువురు రాజకీయ నాయకులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. ఈ క్ర‌మంలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌తో పాటు పలువురు వైసిపి కాంగ్రెస్ నాయకులతో  లగడపాటి ఆంతరంగిక భేటీ నిర్వహించారు.

శనివారం రాత్రి చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడి వివాహ రిసెప్షన్కు లగడపాటి, వసంత హాజరయ్యారు. ఆ తరువాత నందిగామ‌లోని స్థానిక మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాలేటి సతీష్ ఇంట్లో లగడపాటి బస చేశారు. ఆదివారం ఉదయం లగడపాటి, వసంత కృష్ణప్రసాద్ తో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, వైసిపి నాయకులు మాజీ ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు మంగళూరు కోటి రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ను కలిశారు. దీంతో రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మ‌రోవైపు ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి చేరుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒకవేళ ఆయన వైసీపీలో చేరితో విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

NTR District former MP Lagadapati Rajagopal meets ysrcp mla vasantha krishna prasad

గతంలో ఇక్కడ పోటీ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అంతగా యాక్టివ్ గా లేకపోవడం, లగడపాటికి ఉన్న అనుభవంతో ఈ స్థానంలో పోటీ చేస్తే గెలుస్తారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు తెలిపారు. ఆప్యాయంగా పలకరించుకున్నాం కానీ రాజకీయ చర్చలు తమ మధ్య రాలేదన్నారు..

Related posts