telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ-ఎంఐఎం ల సుధీర్ఘ భేటీ.. అందుకేనా..

YCP released MLA Candidates List

ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎన్నికల సమయానికి పార్టీని, మద్దతు దార్లతో బలాన్ని కూడగట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. స్వతహాగా బరిలోకి వైసీపీ మాత్రమే దిగుతానని మొదటి నుండి చెపుతున్నప్పటికీ, బయటనుండి ఇతర పార్టీల మద్దతు కోరుతుండటం విశేషం. ఆయా వర్గాల ఓట్లను రాల్చుకోడానికి వైసీపీ కూడా తన వంతు రాజకీయం చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ముస్లిం ఓట్ల కోసం తెలంగాణలో పాతుకుపోయిన ఎంఐఎం తో పరోక్ష పొత్తుకు అడుగులు వేస్తుంది. గతంలో ఎంఐఎం కూడా ఏపీలో జగన్ కు మద్దతు ఇస్తానని బహిరంగంగానే ప్రకటించడం విశేషం. దీనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి, హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చర్చలు జరిపారు.

జగన్ కు అత్యంత సన్నిహిత నేతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డి, నిన్న దాదాపు నాలుగు గంటల పాటు అసదుద్దీన్ తో భేటీ అయి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ మర్యాద పూర్వకంగానే కలిశారని పైకి అంటున్నా, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు కోరేందుకే గౌతమ్ రెడ్డి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాను వైకాపాకు మద్దతిస్తూ, ప్రచారం చేస్తానని గతంలోనే అసదుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related posts