telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు..

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఏపీలోనూ ఘనంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా నిర్వహించారు.

మొక్కలు, కూరగాయలు, పువ్వులతో సీఎం కేసీఆర్ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించారు. తద్వారా ఏపీ ప్రజలు కూడా వెన్నంటే ఉన్నారని సందేశం అందించారు. కడియపులంక గ్రీన్ లైఫ్ నర్సరీలో కేసీఆర్ కు ఘనంగా బర్త్ డే విషెస్ తెలిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా..కేసీఆర్‌కు ప్రకృతి అన్నా.. పర్యావరణ పరిరక్షణన్నా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే తెలంగాణలో కోటి మొక్కల కార్యక్రమానికి అప్పట్లో కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కలిసికట్టుగా ఒక్కరోజే నాటిన మొక్కల సంఖ్య కోటి దాటింది.

రాష్ట్ర సాధన మొదలు.. ఏ కార్యక్రమం చేపట్టినా.. ఏ పథకం రూపుదిద్దినా.. ఉద్యమరూపంలోనే.. ఉధృతరూపంలోనే నడిపే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కదిలొచ్చిన ప్రజల స్ఫూర్తికి పుడమితల్లి పులకించిపోయింది. ఆ ప్రకృతి ఉద్యమానికి కడియం నర్సరీల నుంచే మొక్కలు తీసుకొచ్చారు. ఆ కడియం నర్సరీ తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది.

ఆ విషయాన్ని గుర్తుంచుకున్న కడియం రైతులు.. వినూత్నంగా మొక్కలు, కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కడియపులంక గ్రీన్ లైఫ్ నర్సరీలో కేసీఆర్‌కు ఘనంగా బర్త్ డే విషెస్ తెలిపి తమ అభిమానాన్ని.. గోదారోళ్ల మర్యాదను చూపించారు.

Related posts