telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో 108 సిబ్బంది మెరుపు సమ్మె.. నిలిచిపోయిన వాహనాలు

108 staff strike

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీలో 108 సిబ్బంది మెరుపు సమ్మెకు దిగింది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర 108 సిబ్బంది నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన దీక్ష చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ 108 వాహనాలు నిలిపివేసి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 14 ఏళ్లుగా 108లో పనిచేస్తున్నామని, రోజుకు 12 గంటలు పని చేస్తున్నామని చెప్పారు. తమకు 8 గంటల పని విధానం అమలు చేయాలని, బకాయిలు చెల్లించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

కొత్త ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని సిబ్బంది కోరుతున్నారు. గత జీవీకే కంపెనీ నుంచి విడిపోయి ఏడాదిన్నర అయిందని ఆ కంపెనీ ఇవ్వాల్సిన పెండింగ్ జీతాలు, పీఎఫ్ ఇంతవరకు చెల్లించలేదని వాపోయారు. ఆ కంపెనీ నుంచి ఒక్కొక్కరికి సుమారు రూ. 50వేలు రావాల్సి ఉందని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుత కంపెనీ కూడా రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదని అన్నారు. ప్రభుత్వం తమకు పెంచిన రూ. 4వేలు కూడా ఇంతవరకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts