ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2000 మంది ఉద్యోగుల పై వేటువేసింది. ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందునే వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఐబీఎం వెల్లడించింది. వాస్తవానికి ప్రస్తుతం వేటుకు గురైన ఉద్యోగులు ఐబీఎం ఉద్యోగుల సంఖ్యలో ఒక్క శాతం కంటే తక్కువే ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం కార్యాలయాల్లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్న మా ప్రయత్నంలో భాగంగా సమర్థత చూపలేని ఉద్యోగులను తొలగించడం సాధారణమైన విషయమేనని ఐబీఎం పేర్కొంది. కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను ఎంపిక చేసుకుని వినియోగదారులకు సేవలు అందిస్తామని వివరించింది.
కేంద్రం హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సుజనా చౌదరి