telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న శంకర్-చరణ్ సినిమా…?

దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మాములు రెస్పాన్స్ రాలేదు. వీరి కాంబోలో రానున్న సినిమాపై ప్రేక్షకులు ఇప్పుడే తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ విషయంలో దిల్ రాజు చాలా పక్కాగా ఉన్నారని కూడా వార్తులు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు దిల్ రాజు చెప్పిన బడ్జెట్ సినీ వర్గాల్లో దుమారం లేపుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమాకు దిల్ రాజు దాదాపు రూ.150 కోట్లు కేటాయించారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను శంకర్ 3డీగా తెరకెక్కించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారని, అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ సౌత్ కొరియా బ్యూటీతో రొమాన్స్ చేయనున్నారని అనేక వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. చూడాలి మరి త్వరలో వస్తుందేమో…!

Related posts