telugu navyamedia
సినిమా వార్తలు

సలార్‌: ‘రాజమనార్‌’ ఫస్ట్‌లుక్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రబాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా అప్‌డేట్‌ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోమవారం ఉదయం ‘సలార్‌’ నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ని విడుదల చేసింది మూవీ యూనిట్‌. ‘రాజమనార్‌’గా కీలక పాత్రలో కనిపించనున్న జగపతిబాబు లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో జగపతిబాబు సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ముక్కుకు రింగు, కోపం నిండిన చూపులతో జగపతిబాబు బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ వైల్డ్‌, సీరియస్‌ లుక్‌లో కనిపించనున్నారు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. హంబులే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ‘సలార్’ 14 ఏప్రిల్ 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది

Related posts