telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ను రియా వేధించింది… అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు

Ankitha

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో తాజాగా సుశాంత్ తండ్రి.. రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. దీంతో విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ముంబైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండేను బుధవారం ఈ టీం ప్రశ్నించారు. దీంతో ఆమె సుశాంత్‌-రియా బంధం గురించి పలు కీలక విషయాలు పోలీసులకు తెలిపారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ సినిమా విడుదల సమయంలో తనను అభినందించేందుకు సుశాంత్‌ తనకు మెసేజ్‌ చేశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానన్నారు. అయితే ఆ సమయంలో రియా తనను వేధిస్తోందని చెప్పాడని అంకిత పోలీసులకు తెలిపారు. అందుకే తనతో బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నట్లు సుశాంత్‌ వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను బిహార్‌ పోలీసులకు అందించారు. సుశాంత్ సినిమాల్లో రాకముందు.. అంకితతో కలిసి పవిత్ర రిష్తా అనే టీవీ సిరియల్‌లో కలిసి నటించాడు. అప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమాయాణం సాగింది. దాదాపు ఆరేళ్ల పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత సుశాంత్.. అంకిత బ్రేకప్ చెప్పుకున్నారు. సుశాంత్‌ బలవన్మరణం తర్వాత అతడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అంకిత రెండుసార్లు పాట్నాకు వెళ్లింది. అక్కడ సుశాంత్‌ సోదరి శ్వేత సింగ్‌ కీర్తితో అంకిత మాట్లాడినట్లు వెల్లడించింది. ఇక విచారణ అనంతరం.. ‘‘నిజమే గెలుస్తుంది’’అంటూ అంకిత తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Related posts