telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎన్ .టి .ఆర్ 100 అడుగుల విగ్రహమే లక్ష్యం’ – జనార్దన్

ఎన్ .టి .ఆర్. శతాబ్ది సందర్భంగా 100 అడుగుల విగ్రహాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పాలన్న సంకల్పంతో తాను అమెరికాలో పర్యటిస్తున్నానని ఛైర్మన్ టి .డి . జనార్దన్ తెలిపారు . అమెరికాలోని ఫిలడెల్ఫియా లో జరిగిన తానా సభల్లో పాల్గొన్న జనార్దన్ అట్లాంటాలో ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో పాల్గొన్నారు .

ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ .. ఎన్ .టి .ఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా కమిటీ అన్న గారి శాసన సభ ప్రసంగాలు , చారిత్రక ప్రసంగాలు , శకపురుషుడు అన్న పుస్తకాలను వెలువరించింది . వీటిని విజయవాడ , హైదరాబాద్ లో జరిగిన సభల్లో ఆవిష్కరించాము . ఇప్పుడు అన్న గారి స్మృతి తర తరాలు ఉండేలా 100 అడుగుల విగ్రహాన్ని అన్ని హంగులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చెయ్యాలని సంకల్పించామని చెప్పారు

తానా సభల్లో ఎన్ .టి .ఆర్ కు తాము ఊహించని విధంగా అపూర్వ నివాళి ఘటించారని , తమ ప్రయత్నానికి అందరూ సానుకూలంగా స్పందించారని జనార్దన్ తెలిపారు . అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అట్లాంటాకు వచ్చానని , ఇక్కడ అన్న గారి అభిమానులు , తెలుగు దేశం నాయకులు చూపించిన ఆదరాభిమానాలు మర్చిపోలేనని , శకపురుషుడు ఎన్ .టి .ఆర్ కు ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘనంగా సాగుతుందని ఇప్పటికే రుజువయ్యింది , అట్లాంటాలో తమకు అన్నివిధాలుగా మద్దతు ఇస్తామని ఇక్కడి ప్రవాసాంధ్రులు చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనార్దన్ తెలిపారు .

అమెరికాలో వున్న ఎన్ .టి .ఆర్ .సెంటినరీ కమిటీ సభ్యుడు అట్లూరి అశ్విన్ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు .

Related posts