telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా బిల్లుల విషయంలో ఏపీ కీలక నిర్ణయం…

కరోనా బిల్లుల విషయంలో ఏపీ ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై విచారణలో హైకోర్టు కీలక సూచనల పై ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్ధారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. అయితే రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు తెలపగా ఆదేశాల్లో ఇదే స్పష్టం చేసింది ప్రభుత్వం. రోగులకు బిల్లులు ఇచ్చేముందుగా నోడల్ ఆఫీసర్ సంతకం చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా పరిశీలించాలి. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు నగదు తీసుకోకూడదు. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో దిస్ ప్లై బోర్డ్స్ ఏర్పాటు చేయాలి.. ఈ ఆదేశాలు అమలు జరిగేలా జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ , డిఎంహెచ్ఓ లు పరోవేక్షించాలి అని పేర్కొంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Related posts