telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చిరంజీవిపై పెట్టిన పోస్టింగ్ లపై.. ఎమ్మెల్యే చెవిరెడ్డి వివరణ

YCP MLA Chevireddy Join Hospita

సోషల్ మీడియాలో చెవిరెడ్డి ఫ్యాన్స్ పేరిట ప్రముఖ నటుడు చిరంజీవి పై వ్యతిరేక ప్రచారం చేస్తూ పెట్టిన పోస్టింగ్ లపై వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి వివరణ ఇచ్చారు. తిరుపతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ నటుడు చిరంజీవితో తనకు ఏ విధమైన విభేదాలూ లేవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తన ప్యాన్స్ గా చెప్పుకుంటున్న కొందరు చిరంజీవిపై చేస్తున్న తప్పుడు ప్రచారం వెనుక తనకు ఎటువంటి సంబంధాలూ లేవని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ లో తనకు ఎటువంటి ఖాతాలూ లేవని చెవిరెడ్డి తెలిపారు. తనకు అభిమాన సంఘాలు కూడా లేవని అన్నారు. చిరంజీవిపై పెట్టిన పోస్టింగ్ లను ఖండిస్తున్నానని, ఈ మొత్తం పోస్టింగ్ ల వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర దాగుందని ఆరోపించారు. తాను తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ) చైర్మన్ గా ఉన్న సమయంలో చిరంజీవి ఎమ్మెల్యేగా పని చేశారని, అప్పటి నుంచి ఆయనతో సత్సంబంధాలే ఉన్నాయని చెవిరెడ్డి వెల్లడించారు. 

Related posts