చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎస్‌ఐ కుంభకోణం నిందితురాలు పద్మ ఆత్మహత్యకు యత్నించారు. ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకురాలిగా ఉన్న పద్మను ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో ఉన్న పద్మ శనివారం సాయంత్రం.. చికిత్స కోసం ఇచ్చిన మాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఇది గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
బాలయ్య వ్యాఖ్యలతో చిరు షాకింగ్ డెసిషన్…?