telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డువచ్చాయి. దీంతో ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఢీకొంటింది హరీష్ రావు పైలెట్ కారు. ఆ వెంటనే.. పైలెట్ కారును మంత్రి హరీష్ రావు వాహనం ఢీకొంటింది. ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రి హరీష్ రావుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఇక ఈ ఘటన అనంతరం మరో కారులో హైదరాబాద్ కు వెళ్లారు మంత్రి హరీష్ రావు.

Related posts