telugu navyamedia
క్రీడలు వార్తలు

కెప్టెన్ గా రోహిత్ అయితే బాగుటుంది : ఇర్ఫాన్

ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఆడాల్సిన 4 టెస్ట్ మ్యాచ్ లలో కోహ్లీ కేవలం మొదటి టెస్ట్ లో మాత్రమే ఆడనున్నాడు. అతని భార్య అనుష్క శర్మ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో కోహ్లీ తిరిగి భారత్ కు వచ్చేస్తాడు అన్ని నిన్న బీసీసీఐ ప్రకటించింది. అయితే కోహ్లీ లేకపోవడంతో ప్రస్తుతం టెస్ట్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పదించాడు. భారత జట్టులో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం సులువు కాదు. కోహ్లీ దూరం అయిన ప్రభావం భారత జట్టు పైన తప్పకుండ పడుతుంది. అయితే కోహ్లీ స్థానంలో టెస్ట్ కెప్టెన్ గా రహానే కంటే రోహిత్ అయితే బాగుటుంది అని ఇర్ఫాన్ తెలిపాడు. రహానేను కాదనడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. కానీ రోహిత్ కెప్టెన్ అయితే బాగుటుంది. హిట్ మ్యాన్ ఇప్పటికే తన కెప్టెన్సీ నైపుణ్యాలను నిరూపించుకున్నాడు. కాబట్టి అతను కెప్టెన్ గా ఉంటె బాగుంటుంది అనుకుంటున్నాను అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. అయితే అడిలైడ్ ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ డిసెంబర్ 17 నుంచి 21 మధ్య జరుగుతుంది.

Related posts