telugu navyamedia
రాజకీయ వార్తలు

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేజ్రీవాల్

kejrivote

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సివిల్ లైన్స్ పోలింగ్ కేంద్రంలో కేజ్రీవాల్ ఓటు వేశారు. కుటుంబ‌స‌మేతంగా ఆయ‌న ఓటింగ్‌లో పాల్గొన్నారు. త‌మ ఫ్యామిలీ ఫోటోను సీఎం కేజ్రీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. త‌న కుమారుడు తొలి సారి ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పాల్గొన్న‌ట్లు కేజ్రీ చెప్పారు. యువ ఓట‌ర్లు మొత్తం భారీ ఎత్తున పోలింగ్ బూత్‌ల‌కు త‌ర‌లిరావాల‌ని కేజ్రీ కోరారు. యువ‌త ఓటింగ్‌లో పాల్గొంటేనే ప్ర‌జాస్వామ్యం బ‌లోపేతం అవుతుంద‌ని ఆయన అన్నారు

కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర మంత్రులు జయశంకర్, హర్షవర్దన్, బీజేపీ ఎంపీలు పర్వేశ్ వర్మ, మీనాక్షి లేఖి, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా,మొత్తం 70 శాసనసభా స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోంది. ఉద‌యం 8 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 6 గంట‌ల‌కు ముగియ‌నున్న‌ది.

Related posts