ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా జరిగే ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ పనితీరు పై సీఎం జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఇక మీదట ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేశారు.
ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూ పద్ధతిని తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రావాలని ఆదేశించారు. అంతేగాకుండా, నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నియమకాలు పూర్తి పారదర్శకత ఉండేలా అధికారులు వ్యవహరించాలని సూచించారు.