ఆర్టికల్ 370 రద్దు బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పీడీపీ సహా కాంగ్రెస్ తో పాటు ఎన్నో పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని అన్నారు. ఇదే సమయంలో సభలో రాజ్యాంగాన్ని చింపాలని పీడీపీ సభ్యులు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చొక్కాలు చించుకోవడాన్ని తప్పుబట్టారు.