telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భానుడి భగభగలు..బయటకు వెళ్లవద్దు!

this summer exceeds 47 degress and more

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడగాల్పులతో జనాలు ఉక్కిరిభిక్కిరి అవుతున్నారు.  ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలకు భయపడి ఉపాధి, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు పనులకు వెళ్లేందుకే జంకుతున్నారు. వాడగాల్పులు ..ఉక్కబోతకు జనం పిట్టల్లా రాలుతున్నారు.

గురువారం ఒక్కరోజే భానుడి ఉగ్రరూపానికి రెండు రాష్ట్రాల్లో 16 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. వడదెబ్బ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎండ తీవ్రత నేడు, రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.

Related posts