విజయ్ నటించిన చిత్రం బిగిల్ రెండు రోజులక్రితం విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈచిత్రం తో విజయ్ నటించిన సినిమా లు దీపావళి కి విడుదలై వరుసగా 100కోట్ల క్లబ్ లో చేరడం ఇది 5సారి. అందులో భాగంగా 2012 లో తుపాకి, 2104 లో కత్తి, 2017 లో మెర్సల్ , 2018లో సర్కార్ చిత్రాలు దీపావళికి విడుదలై 100కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఓవరాల్ గా 100 క్లబ్ లో చేరడం విజయ్ కి ఇది ఏడో సారి.
ఈరోజు తోపాటు తమిళనాడు లో రేపు కూడా సెలవు కావడంతో బిగిల్ భారీ వసూళ్లను రాబట్టుకోనుంది. బిగిల్ తెలుగు వెర్షన్ విజిల్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ఏపీ & తెలంగాణ లో 7.20కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టింది. ఈ రోజు కూడా ఈసినిమాకి చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డు లు పడడం తో మంచి వసూళ్లనే రాబట్టుకోనుంది. ఓవరాల్ గా ఈచిత్రం వచ్చేవారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు వున్నాయి. అట్లీ డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా నయనతార నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 180కోట్ల భారీ బడ్జెట్ తో ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మించింది.
ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవడం లేదు: లక్ష్మీనారాయణ