telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొత్త వ్యవసాయ చట్టాల పై కేంద్ర వ్యవసాయ మంత్రి…

ఢిల్లీలో దాదాపు మూడు నెలల నుండి కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయం పై రైతులు కేంద్రం ఇప్పటికే 12 రౌండ్లుగా జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.. రైతుల ఆందోళనను కేంద్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. చర్చలకు సిద్ధం.. ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ తలపులు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా.. ఆ దశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి.. అయితే.. తాజాగా.. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రైతులతో చర్చించడానికి తాము సదా సిద్ధంగానే ఉన్నామని పునరుద్ఘాటించారు. నూతన సాగు చట్టాల అమలు విషయం సుప్రీం కోర్టులో ఉన్నందున ప్రస్తుతం అమలు చేయలేకపోతున్నామన్న ఆయన.. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకూ తన అభిప్రాయాలనే వెల్లడించలేదని చెప్పుకొచ్చారు.. తాము ప్రతిపాదించిన వాటికి రైతు సంఘాలు ఓకే చెబితే చర్చలకు తాము రెడీగానే ఉన్నామన్నారు తోమర్. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై రైతులు ఏమని సమాధానం ఇస్తారు అనేది.

Related posts