telugu navyamedia
సినిమా వార్తలు

40 కోట్ల ఆఫర్ ను వదులుకున్న విజయ్ దేవరకొండ ?

Vijay-Devarakonda

సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్” ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే సినిమాను చూసి ఫిదా అయిపోయారు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత క‌ర‌ణ్ జోహార్. అంతేకాదు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌డానికి క‌ర‌ణ్ ఆస‌క్తి చూపిస్తూ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు. అయితే కరణ్‌ జోహార్ ఈ సినిమాతో విజయ్ దేవరకొండను హీరోగా బాలీవుడ్‌కు పరిచయం చేయాలని భావించారట. ఈ మేరకు విజయ్‌కు రూ.40 కోట్లు ఆఫర్‌ కూడా చేశారని సమాచారం. అయితే మన “అర్జున్‌ రెడ్డి” దీన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే విజయ్ స్పందించాల్సిందే. అయితే విజయ్ హిందీలో అవకాశం వచ్చిన విషయాన్నీ “డియర్ కామ్రేడ్” ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తెలిపారు. “హిందీ సినిమాల్లో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అయితే నా సినిమా ఇటూ తెలుగుతో పాటు హిందీలోను ఒకేసారి రావాలనుకుంటున్నానని, ఆ విధంగా ప్లాన్ చేస్తానని అన్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండగా.. నేను అక్కడ ముంబయిలో ఓ అపార్ట్‌మెంట్‌కి మారడం ఇష్టం లేదన్నారు విజయ్. ఇంతకు ముందు కూడా ‘అర్జున్‌ రెడ్డి’ ని హిందీలో రీమేక్‌ చేయబోతున్న సమయంలో మొదట మొయిన్ లీడ్ కోసం ముందు విజయ్‌నే సంప్రదించారు హిందీ నిర్మాతలు. అయితే విజయ్ మాత్రం ఒకసారి నటించిన పాత్రలోనే మరోసారి నటించనని సున్నితంగా తిరస్కరించారట.

Related posts