telugu navyamedia
సినిమా వార్తలు

హాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టనున్న సమంత ..

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలను చేస్తూ త‌న‌కంటూ ఒక ఇమేజ్​ పెంచుకుంటూ పోతున్న అందాల తార సమంత.. ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. గత కొద్దిరోజులుగా సమంత ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతోందని సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు షికారు చేశాయి. ఇక వాటిని నిజం చేస్తూ ఇవాళ సామ్ స్వ‌యంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా వెల్ల‌డించింది.

ఓ ఇంగ్లీష్ సినిమా​లో నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ప్రముఖ రచయిత తిమేరి ఎన్.మురారి నవల ‘ద అరెంజ్​మెంట్స్ ఆఫ్ లవ్​’ ఆధారంగా ఈ చిత్రానికి గతంలో ‘డోంటన్ అబ్బే’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఫిలిప్ జాన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. నెట్​ఫ్లిక్స్​లో ఈ సిరీస్​ ఉంది. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్​ తీయబోయే కొత్త సినిమా​లో సామ్​కు ఛాన్స్ దక్కింది.

Samantha Ruth Prabhu to play bisexual woman in Downton Abbey director Philip John's next Arrangements of Love | Hollywood - Hindustan Times

ఇటీవల ఫిలిప్​ చెన్నై వచ్చినప్పుడు ఆయనను సమంత కలిసింది. అయితే ఈ సినిమాలో సమంత.. 27 ఏళ్ల స్వలింగ సంపర్కురాలి పాత్రలో నటించనుందట. సొంతంగా డికెట్టివ్​ ఏజెన్సీ నడిపే అను అనే అమ్మాయిగా కనిపిస్తుంది.స్వలింగ సంపర్కురాలైనప్పటికీ, తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి పెళ్లికి సిద్ధమయ్యే పాత్రలో సామ్ కనిపించనుంది.

‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’ను సునీతా తాటి ప్రొడక్షన్ హౌస్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సమంత ‘ఓ బేబీ’ సినిమాని సహ-నిర్మించిన బ్యానర్ ఇది! ఈ చిత్రం తారాగణం, సిబ్బంది, షూటింగ్ ఫార్మాలిటీస్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌తో పాటు సమంతకు టాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు ఉన్నాయి. ఆమె బాలీవుడ్ డెబ్యూ కోసం చర్చలు కూడా జరుపుతోంది.

Samantha Ruth Prabhu to star in Downton Abbey director Philip John's next Arrangements of Love : Bollywood News - Bollywood Hungama

“2009లో ‘ఏ మాయ చేశావే’ కోసం ఆడిషన్స్ ఇచ్చా. మళ్లీ 12 ఏళ్ల తర్వాత మరోసారి ఆడిషన్ ఇచ్చాను. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే అనిపించింది. అను పాత్ర కోసం నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ ఫిలిప్ జాన్ సర్” అని సమంత ట్వీట్ చేసింది.

 

Related posts