telugu navyamedia
సినిమా వార్తలు

ఎవడాడు.. ఆఫ్ట్రాల్ ఎస్ ఐ అంటున్న‌ డేనియల్ శేఖర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న సినిమా ‘భీమ్లానాయక్’. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా సాగర్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిత్యామేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌ వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

Bheemla Nayak' film buyers worried about AP ticket price issue

కాగా ఈ సినిమాలో డేనియల్‌ శేఖర్‌ అనే పాత్రలో పవన్‌కు పోటీగా నటిస్తున్నాడు రానా. ఈ క్రమంలో దగ్గుబాటి హీరో పుట్టిన రోజు ను పురస్కరించుకుని తాజాగా మరో అప్డేడ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘వాడు అరిస్తే భయపడతావా.. వాడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. ఆఫ్ట్రాల్ ఎస్ ఐ’ సస్పెండెడ్….” అంటూ ఆవేశంగా డేనియల్ శేఖర్ (రానా) మాట్లాడడం ఈ టీజర్‌లో కనిపిస్తుంది.

WATCH: Rana Daggubati as Blitz of Daniel Shekar from Bheemla Nayak looks powerful and filled with swag | PINKVILLA

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌గా త‌మన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, కాదంబరి కిరణ్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Related posts