telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కల నెరవేరింది అంటూ దుబాయి రాజు ట్వీట్… నెటిజన్లు ఫిదా

Dubai

2009వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున దుబాయిలో మెట్రో రైలు ప్రారంభమయింది. మొదటి ఏడాదిలో 6.89 మిలియన్ల మెట్రో రైడ్స్ జరిగాయి. 2010వ సంవత్సరంలో అది కాస్తా 600 శాతం పెరిగి ఏకంగా 38.66 మిలియన్లకు చేరుకుంది. 2017వ సంవత్సరంలో మొదటిసారిగా దుబాయి మెట్రో రైడ్స్ ఒక బిలియన్ మార్కును దాటాయి. ప్రస్తుతం రోజూ ఆరు లక్షల మెట్రో రైడ్స్ జరుగుతున్నాయని దుబాయి మెట్రో అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ స్పందిస్తూ “నాకు అప్పుడు పదేళ్ల వయసు.. మా నాన్నతో కలిసి 1959వ సంవత్సరంలో లండన్‌కు వెళ్లాను. నాన్నతో కలిసి మొదటిసారిగా నేను రైలును చూశాను. యాభై ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. 2009లో దుబాయిలో మెట్రో రైలు ప్రారంభయింది. తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపితమయింది. దుబాయిలో మెట్రో రైలును ప్రతిపాదించినప్పుడు ఎంతో మంది వ్యతిరేకించారు. అడ్డుకోవాలని చూశారు. కానీ నేడు ఆ మెట్రో రైలు దుబాయికే మణిహారమయింది” అంటూ ట్వీట్ చేశారు. దుబాయిలో మెట్రో రైలు ప్రారంభమయి సోమవారం నాటికి సరిగ్గా పదేళ్లు. దీన్ని పురస్కరించుకుని ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఆ నాటి సంగతులను కొన్నింటిని గుర్తు చేసుకుంటూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related posts