విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీఎం చొరవతో 5 రోజుల్లోనే అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం ప్రకటించిన ప్రతి వ్యక్తికీ రూ.10 వేలు ఇవ్వాలని ఆ గ్రామాల ప్రజలు కోరారని తెలిపారు.
ఐదు గ్రామాలతో పాటు ఏయే గ్రామాలకు సాయం అందించాలనే దానిపై నివేదిక రేపటితోపూర్తవుతుందని అన్నారు. ఈ నివేదికను మంత్రులు, అధికారులు పరిశీలించిన అనంతరం ఆ వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. రేపు లేదా ఎల్లుండి లోపు వాళ్లందరికీ సీఎం చేతుల మీదుగా సాయం అందిస్తామని వివరించారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి దీర్ఘకాలికమైన ప్రణాళిక రూపొందించామని అన్నారు.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్