telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రతిపక్ష నేతలు శ్రీనగర్‌ కు రావద్దు.. కశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన

Congress Gulamnabhi ajad fire Bjp

ప్రతిపక్ష పార్టీల నేతలు శ్రీనగర్‌ కు రావద్దని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌లు నేడు శ్రీనగర్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారు శ్రీనగర్ రావడం వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిపింది. సీనియర్ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అధికారిక ట్విట్టర్ ద్వారా కోరింది.శాంతిభద్రతలకు, ప్రజల ప్రాణాలకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది.

కశ్మీర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికొచ్చి ఆ వాతావరణాన్ని దెబ్బతీయొద్దని ప్రభుత్వం కోరింది. ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రతిపక్ష నేతలు శ్రీనగర్‌ కు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్థించింది.

Related posts