లాక్‌డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణతో సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి.
లాక్‌డౌన్ వల్ల 55 రోజుల పాటు విక్రయాలు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది. ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు. లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం.
రాత్రిపూట రసాయనాలను వదిలేస్తున్నారు: రేవంత్ రెడ్డి