telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న పవన్: మంత్రి అవంతి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నాడని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ తెరవెనుక రాజకీయాలు నడిపి, ఇప్పుడు బహిరంగంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నియంత్రణలోకి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు.

టీడీపీ పాలనలో మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడిచేస్తే స్పందించని పవన్ ఇప్పుడు ఎందుకు రోడ్డెక్కుతున్నాడని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరానందున క్యాడర్ లేని పవన్ కల్యాణ్ నే టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని ఆ పార్టీ చూస్తుందని దుయ్యబట్టారు.

Related posts