telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నూతన సంవత్సరంలో నూతన అధ్యక్షుడు వస్తాడు ; మాణికం ఠాగూర్

Manikam Tagore Congress

గ్రేటర్ ఎన్నికల అనంతరం తెలంగాణలో టిపిసిసి పదవి ఎవరికీ దక్కుతుంది అనేది చర్చముషానియంగా మారింది. అయితే తాజాగా కాంగ్రెస్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ మాణికం ఠాగూర్ టిపిసిసి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరంలో టిపిసిసి కి నూతన అధ్యక్షుడు వస్తారని ఆయన అన్నారు. త్వరలో సోనియా గాంధి నియామకం చేయనున్నారని సోనియా గాంధీ కి అన్ని విషయాలు క్షణ్ణంగా తెలుసని అన్నారు. తెలంగాణ కార్యరూపం దాల్చింది సోనియా గాంధీ వల్లనే అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్న అయన 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి తెచ్చే పటిష్టమైన జట్టును రూపొందిస్తామని అన్నారు. మొన్న తొలి రెండు క్రికెట్ మ్యాచ్ లలో ఓడినా, ఫైనల్ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించిందని అదే తరహాలో అంతిమంగా 2023 ఎన్నికలలో కాంగ్రెస్ దే విజయమని అన్నారు. ఆ దిశగా అందరూ సమిష్టిగా పనిచేసే జట్టును రూపొందిస్తామని ఆయన అన్నారు. పార్టీలో సీనియర్లకు, కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ఏలాంటి విభేదాలు లేవన్న ఆయన పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీలోని అన్ని స్థాయిల్లోని కార్యాకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించామని నా అభిప్రాయం ముఖ్యం కాదు, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయమే ప్రాధాన్యం అని పేర్కొన్నారు. మరి ఆవిడ ఎవరికీ ఆ పదవిని అప్పగిస్తుంది అనేది చూడాలి.

Related posts