కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ మరో మూడు రోజుల్లో నాలుగో ఫేజ్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్ కచ్చితంగా ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో.. నాలుగో దశ లాక్‌డౌన్‌కు అందరూ సిద్ధమవుతున్నారు. కాగా ఈ లాక్‌డౌన్‌కు తాను కూడా రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టిన షాహిద్ కపూర్.. తన భార్య మీరా తనను భరించలేకపోతోందని కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోకు.. ‘నిజానికి చెప్పాలంటే నువ్వొక చెత్త వీడియోను పోస్ట్ చేశావంటూ’ మీరా కామెంట్ పెట్టింది. ఇక లాక్‌డౌన్ సమయంలో ఏం చేస్తున్నారంటూ ఇటీవల ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నేను వంట డిపార్ట్‌మెంట్‌ను తీసుకున్నానంటూ తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతేడాది కబీర్‌సింగ్‌తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న షాహిద్ కపూర్.. ప్రస్తుతం జెర్సీలో నటిస్తున్నారు. తెలుగులో నాని నటించి మెప్పించిన జెర్సీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్‌కు డైరెక్షన్ చేస్తున్నారు.
previous post