ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన అనంతరం అధికార వైసీపీలో మరోసారి విబేధాలు బగ్గుమన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలి ముష్టి యుద్ధానికి దిగారు. ఓ వీధి పోరాటాన్ని తలపించేలా బాహాబాహీకీ దిగారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లాలోని ఆమదాలవలస మండలం దన్ననపేటలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెళ్లాడో, లేదో స్థానిక వైసీపీ కార్యకర్తల్లో వర్గపోరు మొదలైంది. పోలీసులు ఉన్నా గానీ లెక్కచేయకుండా చొక్కాలు చిరిగిపోయేలా పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక నాయకులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.