బాలీవుడ్ నటి సన్నీలియోన్ కేన్సర్ బాధితుల కోసం తనవంతు సాయం అందించాలని ముందుకు వచ్చారు. ఇందుకోసం పెయింటింగ్‌లు వేసి వాటిని వేలం పెట్టనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘అర్జున్ పాటియాలా’లో మెరుపులా మెరిసిన సన్నీలియోనీ ప్రస్తుతం ‘స్ల్పిట్స్ విల్లా సీజన్ 12’ రియాల్టీ షోతో బిజీగా ఉన్నారు. హర్రర్, కామెడీ నేపథ్యంతో సాగే ‘కోకాకోలా’ సినిమాలో కూడా నటించనున్నారు. అంత బిజీలోనూ ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
నా వంతుగా కేన్సర్ బాధితుల కోసం ఏదైనా సాయం చేయాలనుకున్నాను. ఇందుకోసం పెయింటింగ్స్ వేశాను. వాటిని వేలానికి ఉంచుతున్నాను. అలా వచ్చిన డబ్బును కేన్సర్ బాధితులకు అందజేస్తాను’ అంటూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కొన్ని పెయింటింగ్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ‘పెయింటింగ్‌లు వేసినప్పుడే కేన్సర్ బాధితుల కోసం ఆలోచించాను. మీరు కూడా కేన్సర్ బాధితుల కోసం తోచిన సాయం చేయండంటూ సన్నీలియోన్ సూచించారు.