భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే. మే 15 వరకూ ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది ఆసీస్ ప్రభుత్వం. అయితే భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్, ఐపీఎల్ 2021 కామెంటేటర్ మైకేల్ స్లేటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియన్ల భద్రత గురించి ప్రభుత్వం నిజంగా ఆలోచిస్తే.. మమ్మల్ని ఇంటికి రావడానికి అనుమతిస్తారు. ఇది చాలా అవమానకరం. మీ చేతులకు రక్తం అంటింది ప్రధాని గారు. మాతో ఇలా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం. మీ క్వారంటైన్ వ్యవస్థను ఎందుకు మెరుగుపరచుకోవడం లేదు. ఐపీఎల్‌లో పని చేయడానికి నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ ఇప్పుడదే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో కాకుండా భారత దేశంలో ప్రతిరోజూ వేలాది మంది చనిపోతున్నారని, ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలని మైకేల్ స్లేటర్ మరో ట్వీటులో పేర్కొన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలలో కరోనా కేసులు నమోదయిన నేపథ్యంలో స్లేటర్ బుడగను విడిచి పెడతారని సమాచారం తెలుస్తోంది.
previous post
next post
రైతులపై పడ్డ ప్రతీ దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుంది: పవన్