telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారు: భట్టి విక్రమార్క

Batti vikramarka

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్నికల అనంతరం లేకపోయినా ఆరు నెలల కోసం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేసీఆర్‌, ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు .సీఎం కేసీఆర్‌కు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే అప్పులు పెరిగాయన్నారు. ఆయన చేతకానితనాన్ని కేంద్రం మీద రుద్దేందుకు ప్రయత్నింస్తున్నారని విమర్శించారు.

మొదటగా జీఎస్టీని పొడిగిన కేసీఆర్‌.. ఇప్పుడు కేంద్రాన్ని తిడుతున్నారని అన్నారు.సీఎం బడ్జెట్‌ ప్రసంగంలో డబుల్‌ బెడ్‌రూం, నిరుద్యోగ బృతి, ఉద్యోగ కల్పన మాటలే లేవని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ చేసిందేమి లేదు కానీ జలకళ మొత్తం తెచ్చింది ఆయనే అనుకుంటున్నారని విమర్శించారు. మెట్రో రైలు కూడా కేసీఆర్‌ తీసుకురాలేదన్నారు. గత ప్రభుత్వాల పరిపాలన వల్ల వచ్చిన ఫలితాలను కేసీఆర్‌ తన ఫలితాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

Related posts