telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళను కోరిక తీర్చాలంటూ… ఆమె కుక్కను బంధించాడు… చివరకు…!?

Arrest

ఫ్లోరిడాలోని తాంపా ప్రాంతంలో నివాసముండే కెవిన్ అస్టిన్ స్కగ్గ్స్ (36) అనే వ్యక్తి తనకు తెలిసిన ఓ మహిళకు చెందిన కుక్కను అపహరించాడు. ఆ తరువాత శునకాన్ని తిరిగి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని ఆ మహిళకు ఫోన్‌లో సందేశం పంపాడు. అది చూసిన బాధితురాలు హిల్స్‌బరో కౌంటీ పోలీసులను ఆశ్రయించింది. తన కుక్కను అడ్డుపెట్టుకొని కోరిక తీర్చాలని కెవిన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. తనకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో కెవిన్‌తో కొంచెం చనువుగా ఉండడం వల్ల అతడు దాన్ని ఆసరగా తీసుకొని గత ఆరు నెలలుగా తనకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని తన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం కెవిన్‌ తన వాహనంలో కుక్కతో కలిసి వెళ్తుండగా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతడిపై దోపిడీ, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. కెవిన్ అపహరించిన శునకాన్ని అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకొని మహిళకు పోలీసులు తిరిగి అప్పగించారు.

Related posts