వివో మొబైల్ తయారీ సంస్థ తన వీ15 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరను మరోసారి తగ్గించి ఆకట్టుకుంది. మొదటగా రూ.28,990 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్. ఆ తర్వాత రూ.2,000 తగ్గింది. ఇప్పుడు మళ్లీ రూ.3,000 తగ్గడం తో ఈ ఫోన్ ఇప్పుడు రూ.23,990కు అందుబాటులోకి వచ్చింది.
* 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.23,990గా ఉంది.
* ఇక 8 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.26,990.
వీ15 ప్రో ఫీచర్లు :
* 6.39 అంగుళాల స్క్రీన్, ఫుల్‌వ్యూ డిస్ప్లే
* క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 675 ఏఐఈ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్
* 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా
* ట్రిపుల్ రియర్ కెమెరా (12 ఎంపీ+8 ఎంపీ+5 ఎంపీ) వంటి ఫీచర్లున్నాయి.