telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘జగనన్న తోడు’ పథకం మార్గదర్శకాలు విడుదల

cm jagan ycp

రాష్ట్రంలోని చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు కార్యాచరణ కూడా మొదలైంది. ఈనెల 16న దీనికి సంబంధించిన సర్వే ముగియనుంది. ఈనెల 23లోగా అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది.

ఈ పథకం ద్వారా తోపుడు బండ్లు, సైకిల్, వాహనాలపై వస్తువులను అమ్మేవారు, ఫుట్ పాత్ లపై వ్యాపారాలు చేసుకునేవారు, కొయ్యబొమ్మలు, హస్తకళలపై ఆధారపడేవారికి వడ్డీలేని రుణాలు లభించనున్నాయి. ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 10 వేల చొప్పున లోన్లు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.

‘జగనన్న తోడు’ పథకం మార్గదర్శకాలు: 

1. దరఖాస్తుదారుడి వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి.
2. నెలవారీ ఆదాయం పట్టణాల్లో అయితే రూ. 12 వేల లోపు, గ్రామాల్లో రూ. 10 వేల లోపు ఉండాలి.
3. మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
4. కనీసం 5 చదరపు అడుగుల స్థలంలో వ్యాపారాలు చేస్తుండాలి.

Related posts