కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా మాస్కూలు పంపిణీ చేసిన ఓ వ్యక్తి ఇబ్బందుల పాలయ్యాడు. ప్రజలకు మాస్క్ లను ఉదారంగా పంచిన ఓ యువకుడు కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లా వవూసి నగర్ ప్రాంతంలో జరిగింది.
ఇక్కడి ‘మక్కల్ పాదై’ స్వచ్ఛంద సంస్థ తరపున ఓ యువకుడు చెన్నైకి వెళ్లి, కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు ఉచితంగా మాస్క్ లను అందించాడు. ఆపై అతను తిరిగి తంజావూరు వెళ్లిన తరువాత అనారోగ్యం బారిన పడ్డాడు. విషయం తెలుసుకున్న వైద్యులు నమూనాలను పరీక్షించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.