telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులపై విద్యుత్‌ బిల్లుల భారం పడదు: మంత్రి బాలినేని

Balineni srinivas reddy ycp

‘ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ’ విధానానికి ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఉచిత విద్యుత్‌ కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతులపై విద్యుత్‌ బిల్లుల భారం పడదని అన్నారు. రూపాయి భారం పడినా రాజీనామా చేస్తానని అన్నారు.

దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమని బాలినేని శ్రీనివాసరెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్‌ను అవహేళన చేయడమే కాకుండా హైదరాబాద్‌లో రైతులపై కాల్పులకు ఆదేశించిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుందని బాలినేని పేర్కొన్నారు.

Related posts