telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యాక్సిన్‌ తయారీ భారత్‌ బాధ్యత: ప్రధాని మోదీ

pm modi on kargil day

కరోనా వ్యాక్సిన్‌ తయారీ భారత్‌ బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ప్రారంభమైన ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020 సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రపంచంలో 2/3వంతు చిన్నారులకు వ్యాక్సిన్‌ అవసరమని తెలిపారు.అభివృద్ధికి విశేష కృషి చేస్తూ వైరస్‌పై ప్రపంచ పోరులో భారత్‌ భాగస్వామ్యమైందని  తెలిపారు. 

వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత ఫార్మా సంస్థలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. టీకాను కనుగొంటే దాని అభివృద్ధి, ఉత్పత్తిలో భారత్‌ పాత్ర క్రియాశీలకంగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. భారతీయులు సహజ సంస్కర్తలని చరిత్రే ఇందుకు నిదర్శమని ఉద్ఢాటించారు. ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించిన చరిత్ర భారత్‌కు ఉందన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో భారత్‌ అసమాన పోరాటం చేస్తోందని మోదీ అన్నారు.

Related posts