telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

యజమాని చనిపోయిన 15 నిమిషాలకే అతని కుక్క కూడా…!

Dog

స్కాట్లాండ్‌కు చెందిన స్టువర్ట్ హచిసన్(25) అనే యువకుడు కేన్సర్‌ జబ్బుతో తుదిశ్వాస విడవగా.. అతడి పెంపుడు కుక్క కూడా 15 నిమిషాల్లోనే ప్రాణాలను విడిచింది. స్టువర్ట్‌కు తోడుగా ఉంటూ వస్తున్న కుక్క.. చివరకు మరణంలో కూడా అతడికి తోడుగా నిలిచింది. స్టువర్ట్‌కు 2011లో కేన్సర్ సోకినట్టు తెలియడంతో అప్పటి నుంచి నీరో అనే ఓ ఫ్రెంచ్ బుల్‌డాగ్‌తోనే ఎక్కువ సమయం గడుపుతూ వచ్చాడు. మొత్తం మూడు పెంపుడు కుక్కలు ఉన్నప్పటికీ.. స్టువర్ట్‌కు, నీరోకు ప్రత్యేక అనుబంధం ఉండేదని స్టువర్ట్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. తనకు కేన్సర్ అని అందరూ దూరం పెట్టిన సమయంలో కూడా కేవలం నీరో మాత్రమే తన కష్టసుఖాలను పంచుకుంది. ఆగస్ట్ 11వ తేదీన స్టువర్ట్ చనిపోగా.. అతడు చనిపోయిన కేవలం 15 నిమిషాల తర్వాత తన పెంపుడు కుక్క నీరో కూడా మరణించింది. స్టువర్ట్ చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే నీరో నీరసంగా కనిపించడంతో కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. నీరో వెన్నెముక ఇరిగిపోయి చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

Related posts