telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

క్రమబద్ధీకరణకు కొత్త పథకం తెచ్చిన ఏపీ సర్కార్

jagan

ప్రభుత్వ భూముల్లో నిరభ్యంతర ఆక్రమణల క్రమబద్ధీకరణకు కొత్త పథకాన్ని ఏపీ సర్కార్ మరోసారి తీసుకొచ్చింది. గత ప్రభుత్వం బీపీఎల్‌, ఏపీఎల్‌ కుటుంబాలకు 500 చదరపు గజాల వరకు నిరభ్యంతర ఆక్రమణలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించగా దానిని ప్రస్తుత ప్రభుత్వం 300 చదరపు గజాలకు కుదించింది.

ఈ సంవత్సరం అక్టోబరు 15వ తేదీలోపు ఆక్రమణలు జరిగిన వాటికే ఈ పథకం వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నది. ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావడంతో జిల్లాలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ భూముల్లో నిరభ్యంతర ఆక్రమణలకు ఎలాం టి పత్రాలు లేకపోతుండటం వల్ల ప్రభుత్వ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు.

Related posts