telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రైల్వే ట్రాక్ పై కారులో వ్యక్తి… సెకన్ల వ్యవధిలో… ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్

Train

అమెరికాలో ఓ పోలీసు అధికారి తన ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఊతా రాష్ట్రంలోని సెంటర్‌విల్లే హైవే ప్రాంతంలో రూబెన్ కారియా అనే పోలీసు అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. రైల్వే ట్రాక్‌పై ఓ కారు ఉందని, అందులో ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి ఉన్నాడని ఎవరో ఫోన్ చేశారు. రూబెన్ వెంటనే కారు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. దూరం నుంచి రైలు వస్తున్నట్టు గుర్తించారు. మరి కొన్ని సెకన్లలో రైలు కారును ఢీకొడుతుందని తెలిసి కూడా కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కారులో ఉన్న వ్యక్తి మెలకువగా లేకపోవడంతో.. అతడిని కారులో నుంచి వెంటనే బయటకు లాగారు. రూబెన్ అతడిని బయటికి లాగిన సెకన్లలోనే రైలు కారును ఈడ్చుకు వెళ్లిపోయింది. పైనున్న వీడియోలో ఈ సంఘటనను మొత్తం చూడవచ్చు. తన జీవితంలో ఇలాంటి ఘటనను ఇంత దగ్గరి నుంచి చూస్తానని కలలో కూడా అనుకోలేదని రూబెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను కేవలం తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రూబెన్ ధైర్యసాహసాలను చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ మరొక వ్యక్తి ప్రాణాలను కాపాడిని పోలీస్ అధికారికి శభాష్ అంటూ నెటిజన్లు రూబెన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కారులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చగా.. కొద్ది గంటల తర్వాత నిజం తెలుసుకున్నాడు. తన ప్రాణాలను కాపాడిన రూబెన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అయితే తాను కారుతో పాటు రైల్వే ట్రాక్‌పైకి ఎలా వెళ్లాడన్నది తెలియాల్సి ఉంది.

Related posts