telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

రైల్వేలో కొలువుల జాతర.. ధరఖాస్తులకు మే 14న చివరి తేది

Vacancy 13 thousand posts in Railways

రైల్వేలో ఉద్యోగాల నియామకం కోసం ఇటీవల ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. క్లర్క్, గార్డ్, జేఈ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు సమర్పించడానికి మే 14 చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందులో మొత్తం 310 పోస్టులు భర్తీ చేయనున్నారు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 12, టెక్నీషియన్-III:65, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 48, గూడ్స్ గార్డ్- 93, జేఈ/సివిల్: 63, జేఈ/మెకానిక్: 13, జేఈ/ఎలక్ట్రికల్: 11, జేఈ/ఎస్అండ్ టీ: 5.

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుల కోసం ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో 50శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, ఎక్స్ సర్వీస్‌మెన్, 12వ తరగతి కన్నా ఎక్కువ విద్యార్హతలున్న అభ్యర్థులకు 50 మార్కుల నిబంధన వర్తించదు. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

టెక్నీషియన్-III: నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తో మెట్రిక్యూలేషన్ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికేట్. గూడ్స్‌గార్డ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. జూనియర్ ఇంజినీర్: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా లేదా గ్రాడ్యూయేషన్. వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 42ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47ఏళ్ల వయస్సు కలిగి ఉండవలెను. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14 లోపు ధరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్ లో ప్రకటించారు.

Related posts