వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా రఘురామకృష్ణరాజుపై భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తనతో పాటు తన పార్టీ సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు ‘పందులు’ అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఓట్ల కోసమే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు: టీడీపీ ఎంపీ సీతారామలక్ష్మి