నాన్వెజ్ తినేవారికి కరోనా రోగికి దాని తీవ్రతను బట్టి కిలోకు 1 గ్రాము నుంచి 1.5 గ్రాము దాకా ప్రొటీన్ ఇవ్వాల్సి వస్తోంది . ఈ ప్రొటీన్సను ఆహారం ద్వారా అందుకోవాలంటే గుడ్లు , చికెన్ , చేపలు తదితర నాన్వెజ్ లభిస్తాయి .
శాకాహారులైతే పప్పు దినుసులు , కందిపప్పు , పెసర , మినప్పప్పు తదితరాల్లో 24 శాతం వరకు ప్రొటీన్ ఉంటుంది . అలాగే బొబ్బర్లు , రాజ్మా , శనగలు వంటి వాటిలో ప్రొటీతో పాటు బి విటమిన్ , పీచు పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి . పాల సంబంధ ఉత్పత్తులు చీజ్ , పన్నీర్ తో పాటు సీడ్స్ , నట్స్ నుంచి కూడా ప్రొటీన్స్ అందుతాయి . ముఖ్యంగా సీడ్స్ , నట్స్ లో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మేలు చేస్తాయి . సప్లిమెంట్స్ అవసరమే కానీ .. విటమిన్లు సప్లిమెంట్స్ రూపంలో కూడా లభిస్తున్నాయి . కరోనా తీవ్రతను బట్టి సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరమే . ఇవి కూడా మనిషి , మనిషికీ మారుతుంటాయి . ఉదాహరణకు ఎప్పుడూ ఏసీలో ఉండే వారికి విటమిన్ డి తప్పనిసరి . అయితే వీలైనంతగా సహజ పద్ధతుల్లో , ఆహారం ద్వారా లభించేలా చూసుకోవాలి . ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటే పౌష్టికాహార సమతుల్యత దెబ్బతింటుంది .
రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి ?
పోషకాలు అధికంగా కలిగిన ఆహారం శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది . బాదం పప్పులో పోషకాలు అధికం . విటమిన్ – ఇ పుష్కలంగా ఉంటుంది . ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడంతో పాటుగా శ్వాస సంబంధిత రోగ నిరోధక వ్యవస్థకూ తోడ్పడుతుంది . ఇందులో జింక్ , ఐరన్ సైతం ఉంటాయి . అలాగే ప్రొబయాటిక్ అధికంగా కలిగిన పెరుగు ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది . వ్యాధికారకాల ( పాతోజెన్స్ ) కు వ్యతిరేకంగా రక్షణను మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది . దీనిలో కాల్షియం , మినరల్స్ , విటమిన్స్ కూడా ఉంటాయి . పచ్చి మామిడిలో విటమిన్ ఏ తో పాటు సీ కూడా అధికంగా ఉంటుంది .