telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాకిస్థాన్‌ను ఒంటరిని చేయబోతున్నాం: అరుణ్ జైట్లీ

Arun Jaitely counter terrists attacks

జమ్మూకశ్మీర్‌ పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్థాన్‌ను భారత్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయబోతున్నామని తెలిపారు. పుల్వామా ఘటనపై రేపు హోంమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. పుల్వామా ఘటన వివరాలను అన్ని పార్టీలకు రాజ్‌నాథ్ వివరిస్తారన్నారు.

పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేందుకు విదేశాంగ శాఖ తరపున అన్ని ప్రయత్నాలు చేస్తామనన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశ ద్రోహులకు సాయం అందించేవారు ఫలితం అనుభవిస్తారని జైట్లీ పేర్కొన్నారు.చొరబాటుదారులు ప్రవేశించకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని వెల్లడించారు. చొరబాటుదారులకు సాయపడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

Related posts