యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు విషయమై రంగంలోకి దిగిన సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు లోతైన విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ సంచలన కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ‘రేసు గుర్రం’ సినిమాలో విలన్‌గా నటించిన ఎంపీ రవికిషన్ పార్లమెంటు సాక్షిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌కు బానిస అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను జయప్రద సమర్ధించింది. అంతేకాకుండా జయాబచ్చన్ దీనికి వ్యతిరేకంగా మాట్లడటం సరికాదని కౌంటర్ వేస్తూ ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారని, డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని జయప్రద పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూలోకి ఎంటరైన నగ్మ, బీజేపీ నాయకుల తీరును తప్పుబడుతూ జయప్రదకు కౌంటర్ ఇచ్చింది. ”ఎన్‌సీబీ, ఈడీ, సీబీఐ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో జయప్రద గారికి తెలియజేయండి. ఈ కేసు విషయంలో వివరాల కోసం అందరూ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించడానికే బీజేపీ నేతలు డ్రగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దేశమంతా సుశాంత్కు న్యాయం జరగాలని, ఆయన మరణం వెనుక కారణాలు తెలుసుకోవాలని చూస్తోంది” అని పేర్కొంటూ ట్వీట్ చేసింది నగ్మ, ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే సుశాంత్ అనుమానాస్పదంగా మృతి చెంది మూడు నెలలు కావొస్తున్నా… ఆయన మృతికి గల కారణాలేంటో తెలియరాలేదు.
previous post
next post