telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ పై పార్కులో దాడి… ఘటనపై కాజల్ రియాక్షన్

Kajal

ఇటీవల బెంగళూరులోని ఓ పార్క్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని వర్కౌట్లు చేస్తోన్న సంయుక్త హెగ్డేపై కవితా రెడ్డి అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్కులో ఇలాంటి బట్టలు వేసుకుని డ్యాన్సులు చేస్తారా అంటూ ఆమె సంయుక్త హెగ్డే, ఆమె స్నేహితురాలిని మందలించారు. సంయుక్త స్నేహితురాలిపై చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పార్కులో ఉన్న మగాళ్లంతా గుమికూడి ఆ పెద్దావిడకే సపోర్ట్ చేశారు. అక్కడికి పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అక్కడ జరిగిన తతంగాన్ని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు సంయుక్త. ఈ ఘటనపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా స్పందిస్తూ “ఓరి దేవుడా సామ్! ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. కవితా రెడ్డి గారు, మీ కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. మీ ఫ్రస్ట్రేషన్‌, కోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. వీటన్నింటినీ మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్లకు తెలుసు. ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిది’’ అని పేర్కొన్నారు. కాగా సంయుక్తకు కవితా రెడ్డి క్షమాపణలు చెప్పారు. 

Related posts